Lok Sabha: NDA కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చిన YSRCP

ysrcp supported nda candidate in lok sabha

Lok Sabha: లోక్ స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో స్పీక‌ర్‌గా ఎన్డీయే కూట‌మి ఓం బిర్లాను ఎన్నుకుంది. మ‌రోప‌క్క ఇండియా కూట‌మి కే.సురేష్‌ను ప్ర‌తిపాదించారు. ఆ త‌ర్వాత మూజువాణి ఎంపిక‌తో ఓం బిర్లాను ఎన్నుకున్నారు. మెజారిటీ ఓం బిర్లా వైపే మొగ్గు చూప‌డంతో ఆయ‌న్నే లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ప్ర‌తిపాదించారు. ఒక బిల్లు లేదా తీర్మానం పైన తమ అభిప్రాయాన్ని ‘అవును’ లేదా ‘కాదు’ అని మూకుమ్మడిగా అరిచి చెప్పేదే మూజువాణి ఓటు. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎన్డీయే అభ్య‌ర్ధికే ఓటు వేయ‌డం గ‌మ‌నార్హం.

అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీలు భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు విజ‌య సాయిరెడ్డి, అంబటి రాంబాబులు త‌మ మ‌ద్ద‌తు ఎన్డీయేకి ఎప్పుడూ ఉంటుంద‌ని.. పొత్తు పెట్టుకోవ‌డం పెట్టుకోక‌పోవ‌డం భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇష్టం అని తెలిపారు.