Renu Desai: నా బిడ్డను ఏడిపించారు.. ఆ ఉసురు మీకు తగులుతుంది
Renu Desai: తనపై చేస్తున్న మీమ్స్ చూసి తన కూతురు ఆద్య కన్నీరుపెట్టుకుందని తెలిపారు నటి రేణూ దేశాయ్. తన బిడ్డను ఏడిపించారని.. ఆ పాపం ఊరికే పోదని ఆ ఉసురు తప్పకుండా తగులుతుంది అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన భార్య ఆన్నా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి ఓ ఫోటో దిగారు.
ఆ ఫోటోను రేణూ పోస్ట్ చేస్తూ.. “” చాలా మంది ఈ ఫోటోను నేను క్రాప్ చేసి పోస్ట్ చేస్తాను అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నా కూతురు ఆద్య ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే తన తల్లిపై వచ్చిన మీమ్ చూసి కన్నీరుపెట్టుకుంది. ఇలా నా బిడ్డను నన్ను మీమ్స్ వేసి ఏడిపిస్తున్న మీకు తప్పకుండా మా ఉసురు తగులుతుంది. ఈ మీమ్స్ వేసేవారంతా ఘరమైన మనుషులు “” అని మండిపడ్డారు.