Viral News: ముక్కు దురదగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే షాక్..!
Viral News: ఓ వ్యక్తి ముక్కు విపరీతంగా దురద పెడుతోందని వైద్యుడి వద్దకు వెళ్లాడు. పరీక్షలు చేసిన ఆ వైద్యుడు షాకయ్యాడు. ఎందుకంటే ముక్కులో పెద్ద జలగ ఇరుక్కుని ఉందట. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. సెసిల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌కు వెళ్లాడు. అక్కడ జలపాతం వద్ద దిగి బాగా ఎంజాయ్ చేసాడు.
అతను ఇంటికి వచ్చినప్పటి నుంచి ముక్కులో విపరీతంగా దురద పెడుతోందట. ముక్కులో ఏదన్నా ఇరుక్కుని ఉందేమో అని తుమ్మడానికి ప్రయత్నించినా కుదరలేదట. దాంతో వెంటనే వైద్యులను సంప్రదించాడు.ముక్కుకి పరీక్షలు చేసిన వైద్యులు లోపల రెండు అంగుళాల జలగ ఇరుక్కుని ఉండటం చూసి అవాక్కయ్యారు. వెంటనే శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా ఆ జలగ వల్ల కళ్లు, బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాల మీదకు వచ్చేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.