Elon Musk: ఎఫైర్లు పెట్టుకుని 11 మంది పిల్ల‌ల‌కు తండ్రైన మ‌స్క్

Elon Musk is now a father to 12 kids

Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ ఏకంగా 11 మంది పిల్ల‌ల‌కు తండ్ర‌య్యాడు. ఈ ఏడాది మ‌స్క్ గ‌ర్ల్‌ఫ్రెండ్ 11వ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌స్క్‌కి చెందిన న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న షివోన్ జిలిస్ అనే యువ‌తి ద్వారా మ‌స్క్ ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్నాడు. మ‌స్క్ త‌న మొద‌టి భార్య జ‌స్టీన్ ద్వారా ఐదుగురు సంతానాన్ని క‌న్నారు. ఆ త‌ర్వాత కెన‌డాకి చెందిన మ్యుజిషియ‌న్ గ్రైమ్స్‌తో ముగ్గురు పిల్ల‌ల్ని.. ఇప్పుడు జిలిస్ ద్వారా ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్నాడు. అయితే జిలిస్‌తో మ‌స్క్ అక్ర‌మ సంబంధం పెట్టుకున్నారు. వీరిద్ద‌రికీ వివాహం కాలేదు.

ఎందుకు ఇంత మందిని కంటున్నాడు?

మ‌స్క్ ఇంత మంది పిల్ల‌ల్ని క‌న‌డం వెనుక ఓ కార‌ణం ఉంద‌ట‌. అదేంటంటే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌నాభా త‌గ్గిపోతోంద‌ని.. చాలా మంది పిల్ల‌ల్ని క‌నేందుకు ఆస‌క్తి చూప‌డంలేద‌ని మ‌స్క్ అంటున్నాడు. అందుకే త‌న వంతుగా జ‌నాభాను పెంచేందుకు సాయ‌ప‌డుతున్న‌ట్లు పేర్కొన్నాడు. త‌న‌లాగా అధిక IQ ఉన్న‌వారు ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని సూచిస్తున్నాడు. మ‌రోప‌క్క మ‌స్క్ ప‌ట్ల ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ ప‌క్క అక్ర‌మ సంబంధాలు పెట్టుకుంటూ పిల్ల‌ల్ని కంటున్న మ‌స్క్.. ఉద్యోగినుల ప‌ట్ల అసభ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని.. త‌న‌తో ప‌డుకోవాల‌ని వేధిస్తున్నాడ‌ని ఇప్ప‌టికే ముగ్గురు యువ‌తులు మీడియా ముందు వాపోయారు.