ఇంట్లో నిత్యం డబ్బు నిలవాలంటే ఈ మంత్రం జపించండి
Spiritual: కొందరి ఇళ్లల్లో అసలు డబ్బు ఎప్పుడూ నిల్వ ఉండదు. ఇంకొందరి విషయాల్లో పెద్ద విల్లాలో నివసిస్తుంటారు.. ఖరీదైన కార్లు ఉంటాయి.. ఆ కార్లకు డ్రైవర్లు ఉంటారు. కానీ ఆ డ్రైవర్లకు కొన్ని నెలలుగా జీతాలు ఉండవు. విల్లాలో నివసిస్తుంటారు అనే మాటే కానీ ఇంట్లో డబ్బు ఉండదు. ఇంకొంత మందికైతే బోలెడంత డబ్బు ఉంటుంది కానీ సుఖ సంతోషాలు ఉండవు. ఇలాంటివారికి శుక్ర సంబంధిత దోషాలు ఉంటాయి. ఇలాంటి దోషాలు ఉన్నవారు స్త్రీ శాపం మూలంగా ఇబ్బంది పడుతుండడం, చేతిలో క్యాష్ లేక ఇబ్బంది పడుతుంటారు. స్త్రీ శాపం అనేది శుక్రుడి ద్వారా వస్తుంది.
ఇలాంటి శాపం ఉన్నవారు గత జన్మలో స్త్రీలను ఇబ్బందిపెట్టుంటారు. ఈ శాపం మగవారితో పాటు ఆడవారికీ ఉంటుంది. ఈ దోషాలు పోవాలంటే చంద్రుడు, శుక్రుడు, కేతువు గ్రహాల వద్ద దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేస్తూ ఇంట్లోని వాయువ్యం, ఉత్తరం, ఆగ్నేయ దిశలు బాగుండేలా చూసుకోవాలి. దీంతో పాటు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు అనే లలితా దేవి మంత్రాన్ని ఒక గంట పాటు రోజూ చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.