Mars: భూమిపైకి అంగారకుడి గాలి
Mars: త్వరలో భూమిపైకి అంగారకుడి వాయువు రానుంది. మిషన్‌లో ఉన్న పర్సెవరెన్స్ రోవర్ భూమి పైకి అంగారకుడి గాలిని పంపే ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఆ రోవర్ అంగారకుడిపై ఉండే రాళ్లు, ఇసుక సాంపుల్స్‌ను సేకరిస్తోంది. ఇప్పటివరకు టైటానియం ట్యూబ్‌లలో దాదాపు 24 సాంపుల్స్ సేకరించింది. ఈ ట్యూబ్‌లలో అంగారకుడిపై వీచే వాయువు కూడా ఉంది. ఈ గాలి ద్వారా అంగారకుడి వాతావరణం ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు.
ముఖ్యంగా అంగారకుడిపై ఉండే నియాన్, ఆర్గాన్, గ్జెనాన్ వాయువులపై పరిశోధన ఎంతో కీలకం. ఎందుకంటే అంగారకుడిపై కోట్లాది సంవత్సరాల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి కానీ ఈ వాయువుల్లో మాత్రం ఇసుమంతైనా మార్పు జరగలేదు. ఒకవేళ అంగారకుడిపైకి మనిషిని పంపే మిషన్ చేపట్టాలన్నా ఈ పరిశోధన ఎంతో కీలకం. ఎందుకంటే అక్కడి ఇసుక ఎంత విషపూరితంగా ఉంటుంది? అసలు ఉండగలమా లేదా అనే విషయాలు బయటపడతాయి. దీనిపై అసలు అంగారకుడి గురించి ఏన్నడూ పరిశోధనల్లో పాల్గొనని శాస్త్రవేత్తలు కూడా ఈ సాంపుల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట.