Covid: మరో వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!
Hyderabad: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ (Covid) మహమ్మారిని అడ్డుకోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు ఫార్మా రంగాలతో కలిసి వ్యాక్సిన్ల తయారీపై దృష్టిపెడుతున్నాయి. ఇప్పటికే భారత ఫార్మా సంస్థలు కోవాగ్సిన్, (Covaxin) కోవిషీల్డ్ (Covisheild) అందుబాటులో ఉన్నాయి. వీటితో చాలా మటుకు కోవిడ్ సోకినా యాంటీబాడీల కారణంగా ప్రాణాలతో బయటపడగలిగాం. ఈ నేపథ్యంలో కోవిన్ పోర్టల్‌లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దాని పేరే కోవోవాక్స్ (Covovax). ప్రస్తుతానికి దేశంలో మళ్లీ కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్న నేపథ్యంలో కోవోవాక్స్‌ను కోవిన్ పోర్టల్‌లో చేర్చాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా (Mansukh Mandaviya) వెల్లడించారు. కోవోవాక్స్‌ను కోవిన్ పోర్టల్‌లో చేర్చాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ను ఆదేశించారు.
దాంతో మరికొద్ది రోజుల్లోనే కోవిన్ పోర్టల్‌లో కోవోవాక్స్ అందుబాటులోకి రానుంది. దీని ధర ఒక్కో డోసుకు 225 రూపాయాలు ఉండబోతోంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవోవాక్స్ వ్యాక్సిన్‌ను DCGI, WHO, మరియు USFDA సంస్థలు క వరల్డ్ క్లాస్ వ్యాక్సిన్‌గా గుర్తించడంతో వెంటనే కోవిన్ పోర్టల్‌లో చేర్చాలని ప్రకాశ్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. ఆల్రెడీ కోవాగ్సిన్, కోవిషీల్డ్ తీసుకున్నవారు కూడా ఈ కోవోవాక్స్ తీసుకోవచ్చు. ఈ కోవోవాక్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్.. అమెరికాకు చెందిన వ్యాక్సిన్ తయారీల సంస్థ నోవావాక్స్తో కలిసి తయారుచేసింది.