Kalki 2898 AD: ప్ర‌భాస్ ఫ్యాన్స్ న‌న్ను క్ష‌మించండి

amitabh bachchan says sorry to prabhas fans

Kalki 2898 AD:  ప్ర‌భాస్ అభిమానుల‌కు క్షమాప‌ణ‌లు చెప్పారు అమితాబ్ బ‌చ్చ‌న్. క‌ల్కి 2898 ఏడి సినిమాలో అమితాబ్ అశ్వ‌థ్థామ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో త‌న పాత్ర గురించి అమితాబ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు.

“” నా ద‌గ్గ‌రికి నాగ్ అశ్విన్ వ‌చ్చిన‌ప్పుడు అశ్వ‌థ్థామ పాత్ర‌కు సంబంధించిన స్కెచ్ తీసుకొని వ‌చ్చాడు. ప్ర‌భాస్ ఎలా క‌నిపిస్తాడో కూడా ఒక స్కెచ్‌లో చూపించాడు. నేను చాలా భారీగా ఉన్నాను. నా ముందు ప్ర‌భాస్ చాలా చిన్న‌గా క‌నిపించాడు. పైగా నేను ప్ర‌భాస్‌ను చావ‌బాదుతున్న‌ట్లు చూపించారు. ద‌య‌చేసి ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి ఒక‌టి చెప్పాల‌నుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయ్యాక న‌న్ను తిట్టుకోవ‌డం ట్రోల్ చేయ‌డం వంటివి చేయ‌కండి. సినిమాలో నేను ప్ర‌భాస్ ప‌ట్ల ప్ర‌వ‌ర్తించిన తీరుకు మీకు ఇప్ప‌టినుంచే క్ష‌మాప‌ణ‌లు చెప్తున్నాను “” అని తెలిపారు.