న‌చ్చిన సంబంధం రావాలన్నా.. త్వ‌ర‌గా పెళ్లి కావాల‌న్నా.. ఇలా చేయండి

spiritual remedy for marriage

Remedy for Marriage:  చాలా మంది త‌మ‌కు పెళ్లిళ్లు కావ‌డంలేద‌ని ఆవేద‌న చెందుతుంటారు. అందం చ‌దువు ఉద్యోగం అన్నీ ఉండి కూడా వారికి పెళ్లిళ్లు కాకుండా ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలో తెలుసుకుందాం.

ఇక్క‌డ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. ముందు జ‌న్మ జాత‌కాన్ని బ‌ట్టి ఆ వ్య‌క్తికి ముంద‌స్తు వివాహ యోగం ఉందా? మ‌ధ్య‌మ వివాహ యోగం ఉందా? లేక ఆల‌స్య వివాహ యోగం ఉందా? అనే అంశాల‌ను ప‌రిశీలించుకోవాలి. ఓ మంచి జ్యోతిష్యుడిని అడిగితే మీ జ‌న్మ జాత‌కంలో మీకు ఎప్పుడు వివాహం అవుతుందో చెప్తారు. ఈ క్లారిటీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. అయితే.. చాలా మంది చేసే త‌ప్పేంటంటే.. వారి జాత‌క చ‌క్రంలో ఆల‌స్య వివాహ యోగం ఉంద‌ని తెలీక పెళ్లి కావ‌డంలేదు అని భ‌య‌ప‌డి ఆవేద‌న చెందుతుంటారు.

జాత‌క చ‌క్రంలోని ఏడో స్థానం అయిన శుక్రుడు యాక్టివేట్ అయితే వివాహం దానంత‌ట అదే జ‌రుగుతుంది. దీని గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ముందు మ‌నం తెలుసుకోవాలి. ఒక‌వేళ వివాహం అయ్యేందుకు అనుకూలించాల్సిన గ్ర‌హాలు అనుకూలించ‌క‌పోయినా శాస్త్రంలో చెప్పిన కొన్ని ప‌రిహారాలు చేసుకుంటే చ‌క్క‌గా వివాహం జ‌రిగిపోతుంది. ఆ ప‌రిహారం ఏంటంటే.. రాహు కేతువుల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాలి.  ఇందుకోసం రాహు, కేతు గ్ర‌హాల వ‌ద్ద దీపారాధ‌న చేయండి. రాహు కేతు పూజ‌లు జ‌పాలు చేయించుకునే స్తోమ‌త ఉన్న‌వారు చేయించుకోవ‌చ్చు. అలా చేయించుకోలేని వారు దీపారాధ‌న చేస్తే స‌రిపోతుంది.

దీపారాధ‌న చేసాక ఇంటికి వ‌చ్చి దుర్గాదేవి, వినాయ‌కుడి అష్టోత్త‌రాలు చదువుకోవాలి. ఇవి చేస్తే గ్ర‌హాలు క‌దులుతాయి. క‌చ్చితంగా మార్పు అయితే క‌నిపిస్తుంది. ఆ మార్పు మీ మ‌న‌సుకే తెలుస్తుంద‌ని పెద్ద‌లు, జ్యోతిష్య నిపుణులు కూడా చెప్తున్నారు. వివాహం ఆల‌స్యంగా అయ్యే అవ‌కాశాలు ఉన్న‌వారు రాహువు, కేతువుతో పాటు శ‌ని గ్ర‌హానికి కూడా దీపారాధ‌న చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మీకు తెలిసిన, న‌మ్మ‌కం ఉన్న జ్యోతిష్యులు ఉంటే జాత‌కాన్ని చూపించుకుని వారు చెప్పే ప‌రిహారాల‌ను పాటించాల‌నుకున్నా ఫ‌ర్వాలేదు. అలాకాకుండా ఎవ‌రు ప‌డితే వారి ద‌గ్గ‌రికి వెళ్లి ద‌య‌చేసి డ‌బ్బులు వృథా చేసుకోకండి.