Gautam Gambhir: ఈ ICC రూల్ బాలేదు.. తీసేస్తే మంచిది
Gautam Gambhir: ICC అమలు చేసిన రెండు బంతుల రూల్‌ను తీసేస్తే బెటర్ అని అభిప్రాయపడ్డారు క్రికెటర్ గౌతమ్ గంభీర్. ODIలలో రెండు బంతుల రూల్ 2011 అక్టోబర్ నుంచి అమల్లో ఉంది. ఈ రూల్ వల్ల వేళ్లతో బంతిని స్పిన్ చేసే బౌలర్లకు చాలా కష్టంగా ఉంటుందని రివర్స్ స్వింగ్ వేసే అవకాశాలు కూడా ఉండవని గంభీర్ తెలిపారు. వైట్ బాల్ క్రికెట్‌లో వేళ్లతో బంతిని వేసే స్పిన్నర్లు ఆడటంలేదని ఈ రెండు బంతుల రూల్ వారిపై చాలా ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ రూల్ కేవలం బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే పనిచేస్తుందని.. దీని వల్ల క్రికెట్‌లో ఇమ్‌బ్యాలెన్సింగ్ ఏర్పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు బంతుల రూల్‌ను తొలగించాలని ICCని కోరారు.