Lifestyle: నా భార్య ఎప్పుడూ టీవీ చూస్తుంటుంది.. నా అవ‌స‌రాలు తీర్చ‌డంలేదు

my wife keeps watching tv and ignores me

Lifestyle: నా భార్య ఎప్పుడు చూసినా టీవీకే అతుక్కుపోయి ఉంటోంది. క‌ల‌యిక స‌మ‌యంలో కూడా టీవీ చూస్తున్నాను మూడ్ లేదు అంటోంది. నా అవ‌స‌రాలను ప‌ట్టించుకోవ‌డంలేదు. ఏం చేయ‌మంటారు?

నిపుణుల స‌ల‌హా

మీరు మెయిల్‌ని బ‌ట్టి చూస్తే ఇంకా మీకు పిల్ల‌లు లేర‌ని తెలుస్తోంది. ఎందుకంటే పిల్ల‌లు ఉంటే మ‌హిళల‌కు టీవీ చూసేంత తీరిక ఉండ‌దు. వారితోనే కాల‌క్షేపం చేస్తుంటారు. ఇక‌పోతే.. ఎప్పుడైనా క‌నెక్ష‌న్ పీకించేసే ప్ర‌య‌త్నం చేసారా? లేదా ఆమెతో నెమ్మ‌దిగా మాట్లాడి న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించారా? ఇవేమీ చేసి ఉండ‌క‌పోతే ఒక‌సారి చేయండి. మ‌న ప్ర‌య‌త్నం లేకుండా నిపుణులు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు చెప్పండి..! కుదిరితే ఓ వారం రోజుల పాటు మీ భార్య‌తో క‌లిసి ఏద‌న్నా ట్రిప్‌కి వెళ్లండి. ఆమెకు న‌చ్చిన ప్ర‌దేశానికే తీసుకెళ్లండి. త‌ప్ప‌కుండా మార్పు వ‌స్తుంది. ఎంత చేసినా ఫ‌లితం లేకపోతే కౌన్సిలింగ్ స‌రైన ప‌ద్ధ‌తి.