Buddha Venkanna: రేయ్ పిచ్చి కుక్కా.. నడిరోడ్డు మీద నిలబెట్టి కొడతా
Buddha Venkanna: వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నానిపై మండిపడ్డారు తెలుగు దేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న. సచివాలయంలోని ఫర్నీచర్ జగన్ మోహన్ రెడ్డి దొంగిలించారు అని తెలుగు దేశం పార్టీ వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో నిన్న కొడాలి నాని అదే నోటి దురుసుతో రెచ్చిపోయారు.
ఆ ముష్ఠి ఫర్నీచర్ ఎంతైందో చెప్తే డబ్బు ముఖాన పడేస్తాం అని నాని అన్నారు. దానిపై బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. “” ముష్ఠి ఫర్నీచర్ ఏంట్రా ముష్ఠి ముఖమోడా. ఉడతలు పట్టే ముఖం నాయాలా. నీ అబ్బ సొమ్మా చెల్లించడానికి? అది ప్రజా ధనం. జగన్ మోహన్ రెడ్డిపై డెకాయిట్ కేసులు పెట్టి ఉన్నాయి. ఇంకా పెడతాం కూడా. అనవసరంగా మీడియా ముందు నోరు పారేసుకోవద్దు అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనడంతో మేం మౌనంగా ఉన్నాం. బుద్ధా వెంకన్నకు ఎలాంటి పదవి లేదు ఏం చేస్తాడులే అనుకోకు. నాకు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం ముఖ్యం. ఇంకోసారి ఏ వైఎస్సార్ కాంగ్రెస్ వాడైనా ఆయన్ను ఇంకో మాటంటే విజయవాడలో వంద మంది మధ్యలో గుడ్డలు ఊడదీసి కొడతా. కొడాలి నానికి ఇచ్చిన టైం అయిపోయింది. మర్యాదగా పెళ్లాం పిల్లలతో పారిపో “” అని హెచ్చరించారు వెంకన్న