Kodi Kathi Case: కోడి కత్తి కేసులో జగన్కు షాక్..కోర్టుకు రావాల్సిందే
Kodi Kathi Case: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన కోడి కత్తి కేసు ఈరోజు విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బాధితుడైన జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. దాంతో కేసును జులై 4కు వాయిదా వేసారు. గత ఐదేళ్ల నుంచి తాను ముఖ్యమంత్రినని కోర్టుకు హాజరుకాలేనని జగన్ ఈ కేసును వాయిదా వేస్తూ నిందితుడు శ్రీనును ఇబ్బందిపెడుతున్నాడు. అయితే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఎలాంటి వాయిదాలు వేయలేరని.. జులై 4న జరిగే విచారణకు రావాల్సిందేనని శ్రీను తరఫు న్యాయవాది సలీమ్ తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం ఎన్ఐఏ చేతిలో ఉన్నందున రాష్ట్రానికి బదిలీ చేయించుకుని త్వరగా ఓ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.