Lifestyle: వివాహితుడితో ఎఫైర్ పెట్టుకున్నా.. ఇది క‌రెక్టేనా?

i am in relationship with a married man

Lifestyle: నాకు పెళ్లైంది కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల నా భ‌ర్త నుంచి విడిపోయాను. ఆ త‌ర్వాత మ‌రో వ్యక్తి నా జీవితంలోకి వ‌చ్చాడు. కాక‌పోతే అత‌నికి ఆల్రెడీ పెళ్ల‌య్యింది. కానీ భార్య‌తో సంతోషంగా లేను అంటున్నాడు. త‌న భార్య‌కు విడాకులు ఇచ్చి న‌న్ను చేసుకోవాల‌ని అనుకుంటున్నాడు. నేను చేస్తోంది క‌రెక్టేనా? మేం పెళ్లి చేసుకోవ‌చ్చా? స‌ల‌హా ఇవ్వ‌గ‌ల‌రు.

నిపుణుల స‌ల‌హా

ఇది ఎవ‌రికైనా చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి. కాసేపు ఈ స‌హజీవ‌నాలు, అక్ర‌మ సంబంధాల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి పక్క‌న‌పెడ‌దాం. మీకు ఆలోచించే శ‌క్తి.. ప‌రిప‌క్వ‌త ఉన్నాయి. మీకేం అనిపిస్తోంది? మీరు చేస్తున్న‌ది క‌రెక్టే అని మీ మ‌న‌సుకు అనిపిస్తోందా? ఆల్రెడీ పెళ్లైన వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్నా అంటున్నారు. అత‌ను ఎందుకు త‌న భార్య‌కు విడాకులు ఇవ్వాల‌నుకుంటున్నాడో కార‌ణం అడిగి తెలుసుకున్నారా? ఎందుకంటే రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన జీవితాలు బాగుప‌డ‌తాయని గ్యారెంటీ లేదు. మొద‌టి పెళ్లి విఫ‌ల‌మైంది. రెండో పెళ్లి అలా కాకుండా ఉండాలి. కొన్ని విష‌యాలు మ‌న చేతుల్లో ఉండ‌వు. కానీ మ‌న కంట్రోల్‌లో ఉండే అంశాలపై ఫోక‌స్ చేసి ఒక‌టికి నూరు సార్లు ఆలోచించుకుని నిర్ణ‌యాలు తీసుకుంటే మంచిది.