NTR 30: హింట్ ఇచ్చేసిన తారక్..!
Hyderabad: ఎన్టీఆర్(NTR) కొరటాల శివ(Koratala Shiva) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NTR 30 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ని ఇటీవలే ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టిన తారక్(Tarak) తన మొదటి షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత సెట్స్ మీదకు వచ్చారు యంగ్ టైగర్. చివరకు రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు కొరటాల. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్(Jahnvi Kapoor) నటిస్తోంది. జాన్వీకి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.
ఇటీవల తారక్ “వస్తున్నా(Vastunnaa)” అంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్గా అల్లు అర్జున్ పుట్టిన రోజున బావా అంటూ ఎన్టీఆర్ విషెస్ తెలిపారు. “పార్టీ లేదా పుష్ప” అని అడిగారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ ‘వస్తున్నా(Vastunnaa)’ అనేశారు. అయితే ఇప్పుడు ఇదే వస్తున్నా అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం కొరటాల శివ చాలా టైటిల్స్ పరిశీలించారు. రీసెంట్ గా జరిగిన ప్రారంభోత్సవంలో ఆసక్తికర విషయాలు చెప్పారు కొరటాల శివ. మృగాలను వేటాడే మగాడిగా ఎన్టీఆర్ రోల్ ఉంటుందని అన్నారు. దీంతో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఎన్టీఆర్ 30 కోసం భారీస్థాయిలో సెట్స్ వేయబోతున్నారు. గోవా(Goa), విశాఖపట్నం(Vizag) వంటి ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారు.