Kalki 2898 AD: సినిమా అంత‌గా ఆడ‌దు.. జ్యోతిష్యుడి షాకింగ్ వ్యాఖ్య‌లు

kalki-2898-ad-will-not-perform-well-says-an-astrologer

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న క‌ల్కి 2898 AD సినిమా అంత‌గా ఆడ‌ద‌ని ఓ జ్యోతిష్యుడు కామెంట్స్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. పండిత్ జ‌గ‌న్నాథ్ గురూజీ అనే జ్యోతిష్యుడు వివిధ సినిమాల గురించి జోస్యం చెప్తుంటారు. ఆయ‌న చెప్పిన దాంట్లో దాదాపు 90 శాతం నిజ‌మే అయ్యాయ‌ట‌. ఇప్పుడు ఆయ‌న క‌ల్కి సినిమాపై ప‌డ్డారు. రూ.600 కోట్ల‌తో రూపొందుతున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌ద‌ని.. కాక‌పోతే పెట్టిన డ‌బ్బుల వ‌ర‌కు మాత్రం వ‌స్తాయ‌ని అంటున్నారు. ప్ర‌భాస్ జాత‌కం ప్ర‌కారం ఆయ‌న బ్లాక్ బ‌స్టర్ విజ‌యం సాధించాలంటే మ‌రో రెండేళ్లు ఆగాల్సిందే అని అంటున్నారు. ఇలాంటప్పుడే వెంకీ సినిమాలోని ఆడో పెద్ద సిద్ధాంతి.. ఈడో పెద్ద వేదాంతి అనే డైలాగ్ గుర్తొస్తుంది..!