Vakeel saab 2: సీక్వెల్​ ఫిక్స్​..!

Hyderabad: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లోకి వెళ్లి కాస్త గ్యాప్​ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా వ‌కీల్ సాబ్‌(Vakeel saab). ఏప్రిల్ 9, 2021లో విడుద‌లైన ఈ సినిమా కరోనా(Corona) లాక్​డౌన్​తో విసిగిపోయిన ప్రేక్షకులకు ఊరటినిచ్చింది. పవన్​ కల్యాణ్(Pawan Kalyan) ​ లాయర్​గా బెంచీలు విరిగేలా వాదించి మెప్పించిన ఈ సినిమా విడుదలై తాజాగా రెండేళ్లు పూర్త‌య్యాయి. ఇది హిందీ చిత్రం పింక్‌(Pink)కి రీమేక్‌. ఈ సినిమా మంచి విజ‌యాన్నే సాధించింది. అయితే ఇప్పుడు వ‌కీల్ సాబ్ 2 సినిమా కూడా రానుంద‌ని అంటున్నారు డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు. ప్ర‌స్తుతం ఈయ‌న ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. అంతా ప‌క్కాగా కుదిరితే త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనే వ‌కీల్ సాబ్ 2(Vakeel saab 2) సినిమాను తెర‌కెక్కిస్తాన‌ని అన్నారు శ్రీరామ్ వేణు(Sri Ram Venu).

హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్(Amithab Bachan) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ఆయ‌న స్నేహితుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్ర‌మ్(Trivikram) రంగంలోకి దిగి మాట‌లు విష‌యంలో త‌న తోడ్పాటు అందిస్తూనే ప‌వ‌ర్ స్టార్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్లు ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో సూచించారు. శ్రీరామ్ వేణు అలాగే మార్పులు చేర్పులు చేసి వ‌కీల్ సాబ్ సినిమాను తెర‌కెక్కించారు. దిల్ రాజు, శిరీష్ క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. వ‌కీల్ సాబ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా అంజ‌లి, నివేథా థామ‌స్‌, అన‌న్య నాగ‌ళ్ల, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్రస్తుతం దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి రూపొందిస్తున్న హరిహర వీరమల్లు, సుజిత్​ దర్వకత్వం వహిస్తున్న ఓజీ, హరీష్​ శంకర్​ రూపొందిస్తున్న ఉస్తాద్​ భగత్​ సింగ్​ సినిమాల షూటింగ్​లతో బిజీగా ఉన్న పవన్​ కల్యాణ్​ ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి మరి.