యువకుడి నీచపు చర్య.. వివాహితతో ఎఫైర్.. కూతురిపై రేప్
Viral News: ఓ యువకుడి నీచపు చర్య ఔరంగాబాద్‌లో సంచలనం రేపింది. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కూతురిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన యువకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసారు. సునైనా అనే మహిళకు 14 ఏళ్ల కూతురు ఉంది. భర్త ఇంట్లో లేని సమయంలో సునైనా ఓ యువకుడిని ఇంటికి పిలిపించుకుంటోంది. ఈ నేపథ్యంలో బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆమె స్థానిక హాస్పిటల్‌కు తరలించింది. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక 8 నెలల గర్భవతి అని చెప్పారు.
అయితే గర్భం దాల్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఏంటి అని వైద్యులు సునైనాను ప్రశ్నించారు. సమాజం ఏమనుకుంటుందో అని భయపడి చెప్పలేదని సునైనా తెలిపింది. దాంతో వైద్యులే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను విచారించగా.. ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. కానీ అతనెవరో తనకు తెలీదని పేర్కొంది. ఆ తర్వాత సునైనా భర్తను విచారించగా.. తాను లేని సమయంలో తన భార్య కోసం ఎవరో వచ్చి వెళ్తున్నారని తెలిపాడు. దాంతో సునైనా ఫోన్ చెక్ చేయగా ఓ యువకుడి నెంబర్ దొరికింది. పోలీసులు ట్రాప్ చేసి అతన్ని పట్టుకుని నాలుగు పీకగా.. అసలు నిజం బయటపడింది. దాంతో ఆ యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.