Sajjala Bhargav Reddy: స‌జ్జ‌ల కుమారుడిని తొల‌గించిన YSRCP?

ysrcp removes Sajjala Bhargav Reddy from social media wing

Sajjala Bhargav Reddy: ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు స‌జ్జ‌ల భార్గ‌వ్ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా వింగ్ నుంచి తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీని ప్ర‌క్షాళ‌న చేసే ప‌నిలో ఉన్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి నిజాయ‌తీగా ఉంటున్న వారిని త‌న వ‌ద్దే ఉంచుకుని పార్టీకి ఏమీ చేయ‌కుండా న‌ష్టం క‌లిగించేవారిని ప‌క్క‌న‌పెడుతున్నారు.

అయితే భార్గ‌వ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా వింగ్‌ని చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ ప‌ని నుంచి భార్గ‌వ్‌ను త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో న‌ర‌సారావు పేట‌కు చెందిన నాగార్జున యాద‌వ్‌ను నియ‌మించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్‌పై చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌ను తిప్పి కొట్ట‌డంలో భార్గ‌వ్ రెడ్డి విఫ‌ల‌మ‌య్యాడ‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌.

భార్గ‌వ్ రెడ్డి పార్టీ ఫండ్స్‌ని దుర్వ‌నియోగం చేసి ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌కు ల‌క్ష‌ల్లో క‌ట్ట‌బెట్టాడ‌ని.. కానీ వారి వ‌ల్ల పార్టీకి ఒరిగింది ఏమీ లేద‌ని జ‌గ‌న్ అన్న‌ట్లు తెలుస్తోంది. గురువారం జ‌ర‌గబోయే స‌మావేశానికి ఎవ‌రెవ‌రు హాజ‌రువుతున్నారో తెలిసిపోతుంద‌ని.. ఒక‌వేళ హాజ‌రుకాని వారు ఎవ‌రైనా ఉంటే వారు వేరే పార్టీల్లోకి జంప్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అనుకోవాల‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.