Marriage: చనిపోయిన ప్రేమ జంటకు పెళ్లి చేసిన పెద్దలు
Marriage: కొన్నాళ్లుగా ప్రేమలో ఉండి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుందాం అనుకున్న ఓ జంట రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దాంతో వారు కోరుకున్నట్లుగానే ఇరువైపు పెద్దలు వారి ఆత్మలకు పెళ్లి చేసారు. ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. యాంగ్, లీ అనే జంట నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. జూన్ 2న యాంగ్ పుట్టినరోజు కావడంతో బ్యాంకాక్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో యాంగ్ తన ప్రేయసి లీతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. ఆ జంట అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ విషయం తెలిసి ఇరు వైపు కుటుంబీకులు ఎంతో కుంగిపోయారు. యాంగ్, లీ చనిపోయినప్పటికీ వచ్చే జన్మలో అయినా కలిసే పుట్టాలని భావించి ఇరు కుటుంబాలు చర్చిలో వారిద్దరి ఫోటోలు పెట్టి ఆత్మలకు పెళ్లిళ్లు చేసాయి. తమ ఆచారం ప్రకారం కోరిక తీరకుండా ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకు శాంతి ఉండదని భావించి ఇలా ఆత్మలకు పెళ్లిళ్లు చేసామని వారు అంటున్నారు.