Sania Mirza: షమీతో సానియా వివాహం?
Sania Mirza: టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా.. క్రికెటర్ మహ్మద్ షమీ వివాహం చేసుకోబోతున్నారా? ఈ రూమర్స్ జనవరి నుంచి వినిపిస్తున్నాయి. కానీ దీనిపై సానియా కానీ షమీ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరికొన్ని కథనాల ప్రకారం వీరిద్దరూ ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నారని బయటికి మాత్రం తెలీనివ్వడంలేదని అంటున్నారు. దీనిపై ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్కి చెక్ పడేలా లేదు. మరోపక్క సానియా మాజీ భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయెబ్ మాలిక్.. సానియాతో విడాకులైన కొన్ని రోజులకే సన అనే నటిని వివాహం చేసుకున్నారు.
సానియాకు విడాకులు ఇవ్వకుండానే షోయెబ్ సనాతో రిలేషన్షిప్లో ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సానియా తన కుమారుడితో ఇండియాలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె షమీని వివాహం చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోపక్క షమీ కూడా తన మొదటి భార్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.