Renu Desai: పవనే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు
Renu Desai: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌కి ఓ అభిమాని ఉచిత సలహా ఇచ్చాడు. “” వదినగారూ.. మీరు మరికొన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా మీరు వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏదైనా విధి ఆడే వింత నాటకమే అనుకోవాలి. కానీ పిల్లలు మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ అన్నయ్య దగ్గరే ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన“” అని ట్వీట్ చేసాడు. దాంతో రేణూ దేశాయ్‌కి ఒళ్లు మండిపోయింది. “” నీకు కొంచెం అయినా బుద్ధి ఉంటే ఈ కామెంట్ పెట్టేవాడివి కాదు. నేను పవన్‌ని వదల్లేదు. ఆయనే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి ఇలాంటి కామెంట్స్ చేసి నన్ను మరింత బాధపెట్టకండి “” అని మండిపడ్డారు.