Avika Gor: నా బాడీగార్డ్ నన్ను వెనక నుంచి పట్టుకున్నాడు
Avika Gor: తన బాడీగార్డే తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు ప్రముఖ నటి అవికా గోర్. బాలికా వధు అనే హిందీ సీరియల్‌తో అలరించిన అవిక తెలుగులో ఉయ్యాల జంపాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి మధ్యలో మాయమైపోయారు. ఇప్పుడు మళ్లీ స్లిమ్‌గా మారి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అవిక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. “” ఓసారి నేను ఈవెంట్‌కి వెళ్లాను. స్టేజ్‌పైకి ఎక్కుతుంటే నన్ను ఎవరో వెనక నుంచి పట్టుకున్నట్లు అనిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే నా బాడీగార్డ్. వెనక్కి తిరిగి చెంప పగలగొడదామనుకున్నా కానీ అంత ధైర్యం రాలేదు. నాకే అప్పటికి అంత ధైర్యం ఉండి ఉంటే ఈపాటి చాలా మంది చెంపలు పగిలేవి. కానీ ఇప్పుడు నాకు ఆ ధైర్యం వచ్చింది. కానీ అలాంటి సంఘటనలు మాత్రం ఎదురుకాకూడదు అనుకుంటున్నాను “” అని తెలిపారు.