నీ వ‌ల్లే మ‌నం ఓడిపోయాం.. జ‌గ‌న్‌పై మాజీ మంత్రి సీరియస్

ysrcp ex minister slams jagan mohan reddy

Jagan:  ఎన్నిక‌ల‌కు ముందు నుంచి వైనాట్ 175 అనే డైలాగ్‌ను తెగ వాడేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంత‌టితో ఆగ‌కుండా కొంద‌రు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు చాలా అస‌హ్యంగా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో చేసిన వ్యాఖ్య‌లే ఆ పార్టీ కొంప‌ముంచాయ‌ని చెప్పాలి. వైనాట్ కుప్పం.. వైనాట్ మంగ‌ళ‌గిరి అంటూ తెగ రెచ్చిపోయి వ్యాఖ్య‌లు చేసారు. తీరా చూస్తే ప్ర‌జ‌లు 11 సీట్లు ఇచ్చి ప్ర‌తిప‌క్షం కూడా లేకుండా చేసారు.

దాంతో ఇది వ‌ర‌కు అస‌లు నేత‌ల‌కు అందుబాటులోకి రాని జ‌గ‌న్.. ఇప్పుడు రోజుకో స‌మావేశం ఏర్పాటు చేసి పార్టీ కేడ‌ర్ ఇత‌ర పార్టీల్లోకి జంప్ కాకుండా చూసుకునేందుకు వారితో రోజూ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా ఒక్కొక్క బ్యాచ్‌తో జ‌గ‌న్ స‌మావేశం అవుతూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. క‌ళ్లు మూసుకుంటే ఐదేళ్లు గ‌డిచిపోతాయ‌ని ఆ త‌ర్వాత అధికారం మ‌ళ్లీ మ‌న‌దే అని ఆశ‌లు క‌ల్పిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఓ మాజీ మంత్రి జ‌గ‌న్‌పై అస‌హనం వ్య‌క్తం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఎన్నిక‌ల‌కు ముందు వైనాట్ 175 అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఓట్లు అడుగుదాం వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని జ‌గ‌న్ చెప్పార‌ట‌. ఆ విష‌యాన్ని ఓ మాజీ మంత్రి ప్ర‌స్తావిస్తూ.. ఈ మాట వ‌ల్లే పార్టీ ఓడిపోయింద‌ని మండిప‌డ్డార‌ట‌. అది విని జ‌గ‌న్ కంగుతిన్నార‌ట‌. ఎన్నిక‌ల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవ‌డానికి కార‌ణం జ‌గ‌నే అని ఆ మాజీ మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో అభివృద్ధి ప‌నులు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు పార్టీపై ప‌గ తీర్చుకున్నార‌ని.. క‌నీసం రోడ్లు కూడా స‌రిగ్గా వేయ‌లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసార‌ని మాజీ మంత్రి జ‌గన్‌తో చెప్పార‌ట‌. ఈ అనూహ్య ప‌రిణామంతో జ‌గ‌న్ ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయిన‌ట్లు స‌మాచారం.