Pilot: పైలెట్లు గెడ్డాలు ఎందుకు పెంచుకోరు?

why pilots does not grow beard

Pilot: మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా? చాలా మ‌టుకు పైల‌ట్ల‌కు అస‌లు గెడ్డం ఉండ‌దు. అలా ఎందుకో తెలుసా? దీని వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంది. ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ రూల్స్ ప్ర‌కారం గెడ్డం పెంచుకోకూడ‌దు అనే స్ట్రిక్ట్ రూల్ అయితే ఏమీ లేదు. కానీ చాలా మ‌టుకు ఎయిర్‌లైన్స్ త‌మ పైల‌ట్ల‌ను గెడ్డం పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌దు. ఎందుకంటే..

ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ స‌మ‌యాల్లో పైల‌ట్లు ఆక్సిజ‌న్ మాస్క్ ధ‌రించిన‌ప్పుడు ఆ మాస్క్ స‌రిగ్గా సెట్ అవ్వాలి. గెడ్డం ఉంటే మాస్క్ అటూ ఇటూ అయ్యే అవ‌కాశం ఉంటుంది. వంద‌లాది మంది ప్ర‌యాణికుల భ‌ద్ర‌త పైల‌ట్ చేతుల్లోనే ఉంటుంది. కాబ‌ట్టి వారిని గెడ్డం పెంచుకోనివ్వ‌రు. కొంద‌రు పైల‌ట్లు చిన్న‌గా గెడ్డం పెంచుకుంటూ ఉంటారు. దాని వ‌ల్ల పెద్ద స‌మ‌స్య ఏమీ ఉండ‌దు.

ఫెడ‌రల్ ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ 1987లో చేప‌ట్టిన స‌ర్వేలో ఓ విషయం తేలింది. పైల‌ట్లు గెడ్డం పెంచుకోవ‌డం వ‌ల్ల వారికి ఆక్సిజ‌న్ మాస్కులు స‌రిగ్గా ఫిట్ అవ్వ‌క ప‌లువురు ప్రాణాలు కోల్పోయార‌ట‌. అప్ప‌టి నుంచి ఈ గెడ్డం ఉండ‌కూడ‌దు అనే రూల్ అమ‌ల్లోకి వ‌చ్చింది.