NDA ప్ర‌భుత్వం ఎప్పుడైనా కూలిపోవ‌చ్చు.. ఖర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Mallikarjun Kharge says nda government will fall anytime soon

Mallikarjun Kharge: అతి క‌ష్టం మీద మిత్ర‌ప‌క్షాలైన జేడీయూ, తెలుగు దేశం పార్టీ కూటమితో మూడోసారి న‌రేంద్ర మోదీ ఎన్డీయేను గెలిపించుకుని ప్ర‌ధాని అయ్యారు. అయితే ఎన్డీయే ప్ర‌భుత్వం పొర‌పాటున అధికారంలోకి వ‌చ్చింద‌ని అతి త్వ‌ర‌లో ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని అంటున్నారు కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

మొన్న జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూటమి 293 సీట్లు గెలుచుకుంది. అయితే ఇందులో కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్ర‌మే కాదు మిత్ర‌ప‌క్షాలైన తెలుగు దేశం పార్టీ, జ‌న‌తా ద‌ళ్ యునైటెడ్, శివ‌సేన‌, లోక్ జ‌న‌శ‌క్తి పార్టీలు క‌లిసి గెలిచిన స్థానాలు కూట‌మి గెలవ‌డానికి కార‌ణం అయ్యాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీ స్వ‌యంగా నిలదొక్కుకోలేక‌పోయింద‌ని.. ఇలాంటి కూట‌మి ఎంతో కాలం నిల‌వ‌ద‌ని ఖ‌ర్గే అన్నారు. దీనికి ఎన్డీయే కూట‌మి పెద్ద‌లు ధీటుగా బ‌దులిచ్చారు. కాంగ్రెస్ కూడా 1991లో పొత్తు పెట్టుకుని మిత్ర‌ప‌క్షాల ద్వారా పీవీ న‌ర‌సింహారావు అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి ఖ‌ర్గే మ‌ర్చిపోయిన‌ట్లున్నారు అని గుర్తుచేసారు. అయితే ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే మ‌రో మాట అన్నారు. మోదీ ప్ర‌భుత్వం ఇలాగే కొనసాగి దేశానికి మంచి చేస్తే తాము కూడా సంతోషిస్తామ‌ని తెలిపారు