War2: ఎన్టీఆర్‌‌ సరసన అలియా భట్!

గ్లామర్ రోల్స్‌‌ తో పాటు ‘గంగూబాయ్ కతియావాడి’ లాంటి ఫిమేల్‌‌ సెంట్రిక్ సినిమాలతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది అలియా భట్(Alia Bhatt). ‘ఆర్ఆర్ఆర్’(RRR) సినిమాతో ఇటు సౌత్‌‌ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఆమె, ఇటీవలే తల్లైంది. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తిరిగి షూటింగ్స్‌‌ తో బిజీ అయ్యింది. తాజాగా ఆమె ఓ క్రేజీ మల్టీస్టారర్‌‌‌‌లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) లీడ్ రోల్స్‌ ‌లో అయాన్‌‌ ముఖర్జీ డైరెక్షన్‌‌లో ‘వార్‌‌‌‌ 2’(War2) తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌ నిర్మించే ఈ స్పై యూనివర్స్‌‌ మూవీలో ఒక హీరోయిన్‌‌గా అలియా భట్‌‌ను సంప్రదించినట్టు బాలీవుడ్ టాక్. ఇద్దరు హీరోల్లో అలియా ఎవరికి జంటగా నటిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అలియా నటించింది రాంచరణ్‌‌కు జంటగా అయినప్పటికీ, ఎన్టీఆర్‌‌‌‌తోనూ క్లోజ్‌‌ ఫ్రెండ్‌‌ షిప్‌‌ ఏర్పడింది. ఇటీవల ఎన్టీఆర్‌‌‌‌ పిల్లల కోసం ఆమె స్పెషల్ గిఫ్ట్స్ కూడా పంపింది.
అదీ గాక తారక్‌‌తో కొరటాల శివ తీసే సినిమాలో హీరోయిన్‌‌గా మొదట అలియానే అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్‌ ప్రారంభంం ఆలస్యం కావడంతో.. అలియా స్థానంలో జాన్వీకపూర్‌‌‌‌ని ఫైనల్ చేశారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత మరోసారి ఎన్టీఆర్‌‌‌‌తో కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారైనా జంటగా నటిస్తుంతో లేదో చూడాలి మరి.
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి సూపర్‌‌హిట్ తర్వాత జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ క్రేజ్ దేశవ్యాప్తమైంది. ఈ సినిమా విడుదలై ఏడాది గడిచినప్పటికీ కూడా మరో సినిమాను తారక్ మొదలుపెట్టలేదు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ప్రకటించినప్పటికీ పలు కారణలతో ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ కేటగిరీలో బెస్ట్‌ సాంగ్‌గా ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ అవార్డు కార్యక్రమం తర్వాత ఇండియా వచ్చిన ఎన్టీఆర్‌‌.. NTR30 షూటింగ్‌ను మొదలు పెట్టారు.