Rashmika Mandanna: స్టుపిడ్ అబ్బాయిలను కాదు.. మంచి అబ్బాయిలను నమ్మండి
Rashmika Mandanna: లోకంలో చాలా మంది మంచి అబ్బాయిలు ఉన్నారని అన్నారు రష్మిక మందన. యానిమల్ సినిమాలోని రణ్బీర్ కపూర్, రష్మికకు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేసి ఫలేనా అనే యువతి అబ్బాయిలపై ట్విటర్లో ఓ కామెంట్ చేసింది. అబ్బాయిలను నమ్మడాన్ని మించిన భయంకరమైన విషయం మరొకటి ఉండదు అని. దీనికి రష్మిక మందన స్పందిస్తూ.. చిన్న కరెక్షన్. స్టుపిడ్ అబ్బాయిలను నమ్మితే అది భయంకరం. అదే సమాజంలో ఉన్న మంచి అబ్బాయిలను నమ్మితే అది స్పెషల్ అని ట్వీట్ చేసారు.