క‌ల్కి సినిమాలో నా వ‌ర్క్ కాపీ కొట్టారు.. సౌత్ కొరియ‌న్ ఆరోప‌ణ‌లు

Kalki 2898 ad prabhas

Kalki 2898AD: ప్ర‌భాస్ న‌టిస్తున్న క‌ల్కి 2898 ఏడి సినిమాలో త‌న వ‌ర్క్‌ను కాపీ కొట్టార‌ని సౌత్ కొరియాకు చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సుంగ్ చోయ్ ఆరోప‌ణ‌లు చేసారు. ప‌దేళ్ల క్రితం తాను డిజైన్ చేసిన ఆర్ట్ వ‌ర్క్‌ని సేమ్ టు సేమ్ క‌ల్కిలో కాపీ కొట్టారంటూ ప‌దేళ్ల క్రితం ఆల్రెడీ యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన వ‌ర్క్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఇత‌రుల ఆర్క్‌ను కాపీ కొట్ట‌డం చాలా పెద్ద త‌ప్ప‌ని.. నీతిలేని ఈ స‌మాజంలో ఆర్ట్ వ‌ర్క్ చేయ‌డం మంచిదా కాదా అని ఇప్ప‌టికీ త‌న‌ని తాను ప్ర‌శ్నించుకుంటూ ఉంటాన‌ని మండిప‌డ్డారు.  మార్వెల్, డిస్నీ, వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ తీసిన చాలా సినిమాల‌కు సుంగ్ చోయ్ కాన్సెప్ట్ డిజైన‌ర్‌గా ప‌నిచేసారు. త‌న అనుమ‌తి లేకుండా కల్కి టీం త‌న వ‌ర్క్ వాడేసుకుని పైగా తామే సొంతంగా క్రియేట్ చేసిన‌ట్లు టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం ప‌ట్ల ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసారు.