Prudhvi Raj: పృథ్వీరాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
Prudhvi Raj: ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2017లో పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తనను వదిలేసి రోడ్డున పడేలా చేసాడని.. పృథ్వీ నుంచి నెలకు రూ.8 లక్షలు మెయింటైనెన్స్ ఇప్పించాలని శ్రీలక్ష్మి కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో వాదనలకు రావాలని కోర్టు నుంచి ఎన్నిసార్లు నోటీసులు పంపినా పృథ్వీ హాజరుకాలేదు. కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ ద్వారా పృథ్వీని అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్‌ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.