JD Lakshmi Narayana: పవన్ కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
JD Lakshmi Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తాను రొటీన్ మంత్రి పదవిలో చూడాలని అనుకోవడం లేదని అన్నారు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. పవన్ ఎం చెప్పినా యువతకి బాగా రీచ్ అవుతుంది కాబట్టి ఉద్యోగ మంత్రిత్వ శాఖ అనే కొత్త శాఖను క్రియేట్ చేసి ఆ శాఖ మంత్రిగా పవన్ ఉంటే ఇంకా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో యువతకు ఉద్యోగాలపై బాగా ఫోకస్ చేసి మాట్లాడారని.. అలాంటప్పుడు ఆయనే ఓ కొత్త మంత్రిత్వ శాఖను క్రియేట్ చేస్తే ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.