Vijaya Sai Reddy: బిల్లు పాస‌వ్వాలంటే BJP మా ద‌గ్గ‌రికి రావాల్సిందే

BJP should remember that they need our support to pass their bills in Rajya sabha

 

Vijaya Sai Reddy: చింత చ‌చ్చినా పులుపు చావ‌లేద‌ని.. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి పాలైనా వైఎస్సార్ కాంగ్రెస్ నాయ‌కులకు ఇంకా బుద్ధి రాన‌ట్లుంది. ఓడిపోయిన త‌ర్వాత కూడా విజ‌య సాయి రెడ్డి త‌న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం మానుకోలేదు. రాజ్య స‌భ‌లో బిల్లు పాస్ అవ్వాలంటే భార‌తీయ జ‌న‌తా పార్టీ చ‌చ్చిన‌ట్లు త‌మ వ‌ద్ద‌కు రావాల్సిందేన‌ని.. రాజ్య స‌భ‌లో త‌మ కంటే తెలుగు దేశం పార్టీకి ఒక అభ్య‌ర్ధి మాత్ర‌మే ఎక్కువ ఉన్నార‌ని.. ఆ విష‌యం భార‌తీయ జ‌న‌తా పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిద‌ని విజ‌య సాయి రెడ్డి అన్నారు.

తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తున్నార‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని చంద్ర‌బాబు నాయుడు నాశ‌నం చేసేసార‌ని విజ‌య సాయి రెడ్డి అన్నారు. తెలుగు దేశం పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీతో చేతులు క‌లిపినా.. రాజ్య స‌భ‌లో బిల్లు పాస‌వ్వాలంటే భార‌తీయ జ‌న‌తా పార్టీకి త‌మ మ‌ద్ద‌తు కావాల్సిందేన‌ని వెల్ల‌డించారు.