Mohan Charan Majhi: ప్ర‌మాణ స్వీకారం వేళ విషాదం

Mohan Charan Majhi is sad as his assistant died in accident before swearing ceremony

Mohan Charan Majhi: ఒడిశాకు కాబోయే ముఖ్య‌మంత్రి మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. కానీ తాను కొత్త బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నాన‌ని సంతోషిస్తున్న స‌మ‌యంలో ఓ విషాద ఘ‌ట‌న ఆయ‌న మ‌న‌సుని క‌ల‌చివేసింది. మాఝీ వ్య‌క్తిగ‌త అసిస్టెంట్ చంద‌న్ మొహాపాత్ర నిన్న రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు. మాఝీకి చంద‌న్ అంటే ఎంతో గౌర‌వం. ఇద్ద‌రూ స్నేహితుల్లా ఉండేవారు. ఈరోజు ప్ర‌మాణ స్వీకారానికి చంద‌న్ కూడా హాజ‌రుకావాల్సి ఉంది. ఈలోగా ఈ విషాదం జ‌రిగిపోయింది. విష‌యం తెలుసుకున్న వెంట‌నే మాఝీ చంద‌న్ నివాసానికి వెళ్లి ద‌గ్గ‌రుండి మ‌రీ అంత్య‌క్రియ‌లు చేయించారు.