Chandrababu Naidu Swearing: జ‌గ‌న్‌కు ఆహ్వానం.. స్పందించ‌ని మాజీ సీఎం

jagan did not respond to chandrababu naidu call

Chandrababu Naidu Swearing: రేపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. చంద్ర‌బాబుతో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. ఈ నేప‌థ్యంలో ఈ వేడుక‌కు అతిర‌థ మ‌హార‌థులు రాబోతున్నారు. అయితే.. వేడుక‌కు మాజీ ముఖ్య‌మంత్రి జ‌గన్ మోహ‌న్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించాల‌ని చంద్ర‌బాబు అనుకున్నారు. గౌర‌వప్ర‌దంగా జ‌గ‌న్ కార్యాల‌యానికి చంద్ర‌బాబు ఫోన్ చేయ‌గా.. జ‌గ‌న్ స్పందించ‌లేదు.

2014లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడు జ‌గ‌న్ ఫోన్ కాల్ ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేసారు. ఆ త‌ర్వాత 2019లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడు కూడా చంద్ర‌బాబు నాయుడు ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపారు. ఈసారి ప్ర‌మాణ స్వీకారానికి జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు ఫోన్ చేస్తే క‌నీసం లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డం అగౌర‌వ‌నీయం.