Lifestyle: గర్భం దాల్చాక నా భ‌ర్త‌ను మోసం చేసా.. లోపం నాలోనే ఉంది

i am bisexual so i had cheat my husband

Lifestyle: “””” నా వ‌య‌సు 28. మాది ఉత్త‌ర్‌ప్ర‌దేశ్. నా స్నేహితుల ద్వారా నాకు ఓ అబ్బాయి ప‌రిచ‌యం అయ్యాడు. ఇద్ద‌రం తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోయాం. ఓ ఐదు నెల‌ల త‌ర్వాత ఇంట్లో మా విష‌యాన్ని చెప్పాం. అంతా ఒప్పుకున్నారు. ఘ‌నంగా మా పెళ్లి జ‌రిగింది. వివాహ‌మైన ఏడాది లోపే నా క‌డుపు పండింది. అయితే నేను గ‌ర్భం దాల్చిన నెల రోజుల త‌ర్వాత నా భ‌ర్త వృత్తి రిత్యా పుణెకు బ‌దిలీ కావాల్సి వ‌చ్చింది. ఉద్యోగానికి సెల‌వుల కూడా పెట్ట‌లేడు పాపం. అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి చూస్తుంటాను అని చెప్పి నాకోసం అన్నీ ఏర్పాట్లు చేసి వెళ్లాడు.

అంతా బానే ఉంది కానీ ఉండాల్సిన స‌మ‌యంలో నా భ‌ర్త ప‌క్క‌న లేకుండాపోయేడ‌నే భావ‌న బాధ‌పెట్టేంది. ఎవ‌రైనా కొత్త ఫ్రెండ్స్‌ని ప‌రిచ‌యం చేసుకుందామ‌ని స‌ర‌దాగా ఓ డేటింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. అయితే నేను అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. చాలా మంది అమ్మాయిలు నా ఖాతాను రిజెక్ట్ చేసారు. దాంతో ఆ ఖాతా తొల‌గించేసి ఒరిజిన‌ల్ వివ‌రాల‌తో నా అస‌లు ఖాతా తెరిచాను. ఎంతో మంది నుంచి రిక్వెస్ట్‌లు వ‌చ్చాయి. అమ్మాయిలు కూడా లైక్ కొట్టేవారు. అలా ఇద్ద‌రు అమ్మాయిల‌తో నాకు ఫ్రెండ్‌షిప్ ఏర్ప‌డింది.

అయితే వారిని క‌లిసాక నాకు తెలిసింది ఏంటంటే.. నేను స్వ‌లింగ సంప‌ర్కురాలిని. నాకు అమ్మాయిల మీద కూడా మోజు ఉంద‌ని తెలిసింది. అలా ఒక అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాను. నాకు నా భ‌ర్తంటే చాలా ఇష్టం. కానీ నాలో ఈ కోణం బ‌య‌ట‌ప‌డ్డాక నేను ఆయ‌న్ని మోసం చేస్తున్న‌ట్లే అవుతుంది. వీలు చూసుకుని మా వారు ఇంటికి వ‌చ్చాక ఈ విష‌యాన్ని చెప్పాల‌నుకుంటున్నాను. బిడ్డ పుట్ట‌బోయే కొన్ని నెల‌ల్లో ఈ చేదు వార్త విని నా భ‌ర్త‌, కుటుంబీకులు ఏమైపోతారో అని భ‌యంగా ఉంది “”””