ఓ పక్క ప్రమాణ స్వీకారం.. వెనకే చిరుత పులి..!
Viral News: నిన్న రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దాదాపు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ పక్క మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. వెనక ద్వారం నుంచి చిరుత పులి లాంటి జంతువు దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కడే ఉన్న మీడియా వర్గాలు తీసిన వీడియోలో చిరుత పులి అక్కడే సంచరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అందరూ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడంలో నిమగ్నమై ఉండటంతో వెనక సంచరిస్తున్న జంతువును ఎవ్వరూ గమనించలేదు. అయితే అది కుక్కా, పిల్లా లేక చిరుతా అనే దానిపై రాష్ట్రపతి భవన్ సెక్యూరిటీ బలగాలు ఆరా తీస్తున్నాయి.