YVS Chowdary: రామ్ పోతినేనిపై రూపాయి బిజినెస్ ఉండ‌దు.. ద‌ర్శ‌కుడి షాకింగ్ కామెంట్స్

YVS Chowdary shocking comments on ram pothineni

YVS Chowdary:  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వైవీఎస్ చౌద‌రి ఒక్క‌సారిగా సెన్సేష‌న‌ల్ అనౌన్స్‌మెంట్ అంటూ మీడియా ముందుకు వ‌చ్చారు. NTR (New Talent Roars) పేరుతో కొత్త బ్యానెర్‌ను ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరోను చౌద‌రి ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. దివంగ‌త న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వ‌డు నంద‌మూరి తార‌క రామారావును వైవీఎస్ చౌద‌రి టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. నంద‌మూరి తార‌క రామారావు హ‌రికృష్ణ పెద్ద కుమారుడు అయిన జాన‌కి రామ్ కొడుకు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రెస్ మీట్ నిర్వ‌హించి.. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిపై షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. రామ్ పోతినేనిపై ఒక్క పైసా లాభం ఉండ‌ద‌ని.. దేవ‌దాసు సినిమాలో రిలీజ్ అయిన‌ప్పుడు థియేట‌ర్ల‌కు జ‌నాలు రాక‌పోయినా వ‌స్తున్నారు అని తానే క‌ల‌రింగ్ ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. మ‌రి దీనిపై రామ్ ఏమంటారో వేచి చూడాలి.