మ‌తిపోయేలా చంద్ర‌బాబు కొత్త కాన్వాయ్..!

chandrababu naidu chose black and black cars in his convoy

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కొత్త కాన్వాయ్ ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది.  ఆయ‌న కాన్వాయ్‌లో మొత్తం 11 ట‌యోటా కంపెనీకి చెందిన కార్లు ఉన్నాయి. అన్నీ బ్ల్యాక్ రంగు కార్ల‌నే ఆయ‌న ఎంపిక‌చేసుకున్నారు. 11 వాహ‌నాల్లో 2 కార్ల‌ను సిగ్న‌ల్ జామ‌ర్ల కోసం వినియోగిస్తున్నారు. అన్ని వాహ‌నాల‌కు 393 నెంబ‌ర్ ప్లేట్‌ను ఎంపిక‌చేసారు. ఈ కాన్వాయ్ వాహ‌నాల‌న్నీ తాడేప‌ల్లి ఇంటెలిజెన్స్ కార్యాల‌యంలో సిద్ధంగా ఉన్నాయి. రేపు ఉద‌యం గ‌న్న‌వ‌రంలో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.