యువతి మిస్సింగ్.. 3 రోజుల తర్వాత కొండచిలువ కడుపులో లభ్యం
Indonesia: ఓ నలుగురు పిల్లల మహిళ మూడు రోజుల పాటు కనిపించకుండాపోయింది. దాంతో ఆమె ఆచూకీ లభించడం లేదని భర్త ఇతరుల సాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. తీరా చూస్తే ఆమె కొండచిలువ కడుపులో కనిపించడంతో వారంతా ఉలిక్కిపడ్డారు.. ఈ భయంకర ఘటన ఇండోనేసియాలో చోటుచేసుకుంది. ఇండోనేసియాలోని దక్షిణ సులావేసి ప్రాంతానికి చెందిన ఫరీదా అనే మహిళ మొన్న గురువారం కనిపించకుండాపోయింది. ఎప్పటిలాగే తిరిగి వస్తుందిలే అనుకుంటూ ఆమె భర్త మరుసటి రోజు ఉదయం వరకు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఎప్పటికీ రాకపోయే సరికి గ్రామ పెద్ద అనుమతితో ఫరీదా కోసం ఊళ్లో వాళ్లంతా వెతకేందుకు యత్నించారు.
అలా వెతుకున్న సమయంలో ఓ ప్రాంతంలో తన భార్య దుస్తుల ముక్కలు కనిపించాయి. ఆ పక్కనే కడుపు ఉబ్బిపోయి ఓ కొండచిలువ అవస్థ పడుతుండడం చూసి దాని కడుపు కోసం చూసారు. తీరా చూస్తే తన భార్య ఫరీదా సగం దుస్తులతో కొండచిలువ కడుపులో శవమై కనిపించింది. ఇండోనేసియాలో కొండచిలువలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చాలా మంది వాటి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.