స‌జ్జ‌ల‌ను ప‌క్క‌న‌బెట్టాల‌ని నిర్ణ‌యించిన జ‌గ‌న్

jagan decides to keep Sajjala Ramakrishna Reddy aside

Sajjala Ramakrishna Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ నేప‌థ్యంలో గ‌త ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా ప‌నిచేసిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని ప‌క్క‌న‌బెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. స‌జ్జ‌ల స్థానంలో విజ‌య‌సాయి రెడ్డిని నియ‌మించాల‌ని అనుకుంటున్నార‌ట‌.

ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేప‌థ్యంలో జిల్లాల వారీగా స‌మీక్ష‌ల‌కు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్నారు. స‌జ్జ‌ల‌, ధ‌నుంజ‌య్ రెడ్డితో వైసీపీ నేత‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. ఆ ఇద్ద‌రే జ‌గ‌న్‌ను ఇత‌ర నేత‌లు క‌ల‌వ‌నివ్వ‌కుండా చేసి ఎన్నిక‌ల్లో ఓట‌మికి కార‌ణం అయ్యార‌ని జ‌గ‌న్ అనుకుంటున్నార‌ట‌. స‌జ్జ‌ల వ‌ల్ల ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు విలువ లేకుండాపోయింద‌ని విమ‌ర్శ‌లు వస్తున్నాయి. స‌జ్జ‌ల తీరుతోనే ఏపీ ఉద్యోగుల్లో వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ స‌జ్జ‌ల అనుచిత వ్యాఖ్య‌లు చేసారు. ఇవన్నీ క‌లిపే జ‌గ‌న్‌ను ఓట‌మి పాలుచేసాయ‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈరోజు జ‌గ‌న్ నేత‌లతో స‌మావేశ‌మై మ‌ళ్లీ ఐదేళ్ల త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని నేటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చిన‌ట్లు తెలుస్తోంది.