Chandrababu Naidu: అమ‌రావ‌తి పేరు సూచించింది రామోజీ రావే

Chandrababu Naidu says ramoji rao suggested amaravathi as capital name

Chandrababu Naidu:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా ఏ పేరు ఉంటే బాగుంటుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీ రావు అమ‌రావ‌తి అయితే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చార‌ని అన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. అనారోగ్యంతో ఈరోజు ఉద‌యం రామోజీ రావు క‌న్నుమూయడంతో ఆయ‌న ఢిల్లీలోనే రామోజీ ఫోటోకు నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు రామోజీ రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రామోజీ రావు అమ‌రావ‌తి పేరును సూచించిన‌ప్పుడు దాదాపు వంద మందితో ఈ పేరు గురించి ప్ర‌స్తావించాన‌ని.. వారు కూడా పేరు చాలా చ‌క్క‌గా ఉంద‌ని చెప్పార‌ని అన్నారు.