Ramoji Rao: రామోజీ రావు క‌న్నుమూత‌

ramoji rao dies

Ramoji Rao: ప‌త్రికా రంగంలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ అధినేత‌, ఈనాడు ప‌త్రిక య‌జ‌మాని రామోజీ రావు క‌న్నుమూసారు. కొంత‌కాలంగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న్ను ఈనెల 5న హైద‌రాబాద్‌లోని ఓ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఈరోజు ఉద‌యం ప‌రిస్థితి విష‌మించ‌డంతో క‌న్నుమూసారు. రామోజీ మృతి ప‌ట్ల సినీ, రాజ‌కీయ, వ్యాపార ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్విట‌ర్ వేదిక‌గా రామోజీకి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛ‌నాల‌తో రామోజీ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.