Lifestyle: నాకు కాబోయే వాడు డేటింగ్ యాప్ వాడుతున్నాడు.. ఏం చేయాలి?
Lifestyle: మా అమ్మానాన్నలు ఓ మంచి సంబంధం చూసారు. అబ్బాయి నాకు నచ్చాడు. త్వరలో మా పెళ్లి. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న సమయంలో నాకు కాబోయే వాడు టిండర్ యాప్‌లో చాలా ఏళ్లుగా ఉన్నాడని కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అంటే అతను చాలా మంది అమ్మాయిలతో డేట్‌కి వెళ్లి ఉంటాడు అనిపిస్తోంది. పెళ్లికి నో చెప్పాలా? ఏమీ తెలీనట్లు మౌనంగా ఉండమంటారా?
నిపుణుల సలహా: ఇలాంటి పరిస్థితుల్లో మనసు తొందరపెట్టే నిర్ణయాల వైపు మళ్లుతుంది. మీరు కాస్త ఆచి తూచి వ్యవహరించాల్సిన సమయం ఇది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీకు కాబోయే వాడి గురించి ఈ విషయం తెలిసింది అంటున్నారు. ఫర్వాలేదు. పెళ్లికి ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఓసారి అతన్ని రెస్టారెంట్‌కో లేదా కాఫీ షాప్‌కో తీసుకెళ్లి ఈ విషయం గురించి మాట్లాడండి. క్యాజువల్‌గా టాపిక్ స్టార్ట్ చేయండి. బహుశా ఇంకా పెళ్లి కాలేదని ఆన్‌లైన్ డేటింగ్ యాప్ వాడుతుండొచ్చు. పెళ్లయ్యాక కూడా ఇలాంటి కొనసాగిస్తాడు అని ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఓసారి అతనితో మాట్లాడి నిర్ణయం తీసుకోండి.