Lifestyle: ఐలవ్యూ అని చెప్తే వింతగా సమాధానం ఇస్తున్నాడు
Lifestyle: నేను ఒక అబ్బాయితో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాను. మొదట్లో బాగానే ఉండేవాడు. ఈ మధ్యకాలంలో వింతగా ప్రవర్తిస్తున్నాడు. సాధారణంగా ప్రేమలో ఉన్నవారు ఐ లవ్యూ అని చెప్తే.. ఎదుటి వారు ఐ లవ్యూ టూ అని చెప్తారు. కానీ నా బాయ్‌ఫ్రెండ్ వింతగా ఐ లవ్డ్ యు టూ (I LOVED YOU TOO) అంటాడు. అంటే ఇప్పుడు నన్ను లవ్ చేయడం లేదని అర్థమా? నాకేం అర్థంకావడంలేదు. ఈ విషయం నన్ను లోలోపలే తినేస్తోంది.
నిపుణుల సలహా: ఇది చాలా చిన్న విషయం. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మైండ్ పాడుచేసుకోకండి. మీ ప్రియుడు అలా ఎందుకు అంటున్నాడో ఎప్పుడైనా అడిగారా? సరదాగా అలా అంటున్నాడేమో..! ముందు ఈ విషయం గురించి తనతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ అతను నిజంగానే ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేయడం లేదు అని తెలిస్తే ఆ రిలేషన్షిప్లో ఉండటం ఇక వేస్ట్. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది.