Nara Bhuvaneshwari: 5 రోజుల్లో రూ.579 కోట్లు సంపాదించిన భువ‌నేశ్వ‌రి

nara bhuvaneshwari earns ₹579 crore in 5 days from this stock

Nara Bhuvaneshwari:  తెలుగు దేశం పార్టీ అధినేత‌.. కాబోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. కేవ‌లం ఐదు రోజుల్లో రూ.579 కోట్లు సంపాదించారు. చంద్ర‌బాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్స్ ఈ వారం రోజుల్లో విప‌రీతంగా లాభాల బాట ప‌ట్టాయి. ఈ స్టాక్‌లో భువ‌నేశ్వ‌రికి 24.37% వాటా ఉంది. హెరిటేజ్ ఫుడ్స్‌కి చెందిన ఒక్కో షేర్ ధ‌ర మే నెల‌లో రూ.402.90గా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు గెల‌వ‌డంతో ఆ షేర్ ధ‌ర రూ.659కి పెరిగింది. ఈ హెరిటేజ్ ఫుడ్స్‌లో నారా భువ‌నేశ్వ‌రి 2,26,11,525 షేర్లు కొనుగోలు చేసారు.