Akira Nandan: వార‌సుడొస్తున్నాడు.. ప్యాన్ ఇండియా స్టోరీ రెడీ

akira nandan to enter tollywood soon

 

Akira Nandan: ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘ‌ట్టం వ‌చ్చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార‌సుడు అకీరా నంద‌న్ టాలీవుడ్ డెబ్యూ చేయ‌బోతున్నాడు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ల‌వ్, యాక్ష‌న్ కాంబినేష‌న్‌లో ఓ స్క్రిప్ట్ రెడీ అవుతోంది. ఇందుకోసం ఓ పెద్ద బ్యాన‌ర్ సినిమాను నిర్మించే బాధ్య‌త‌లు తీసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే అకీరా ఎంట్రీకి అన్నీ సిద్ధం కావాలంటే ఎంత కాద‌న్నా ఒక ఏడాది ప‌డుతుంద‌ని అంటున్నారు. ఏదైతేనేం.. తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉంటారు కాబ‌ట్టి.. ఇక ఆయ‌న లెగ‌సీని అకీరా కొనసాగిస్తాడు అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు.