Kangana Ranaut: కంగ‌న చెంప ఛెళ్లుమ‌నిపించిన కానిస్టేబుల్

kangana ranaut was slapped by a crpf personnel

Kangana Ranaut: బాలీవుడ్ న‌టి, మండి ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌కు షాకింగ్ ఘ‌ట‌న ఎదురైంది. ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆమెపై చేయిచేసుకుంది. ఈ ఘ‌ట‌న ఛండీఘ‌డ్ విమానాశ్ర‌యంలో చోటుచేసుకుంది.  కంగ‌న విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయిన త‌ర్వాత ఎయిర్‌పోర్ట్ లోంజ్‌లో కూర్చుని ఉన్నారు. ఆ స‌మ‌యంలో పంజాబ్‌కి చెందిన కొంద‌రు రైతులు ఆందోళ‌న చేస్తున్నార‌ని వారంతా రైతులు కార‌ని ఖ‌లిస్తానీల‌ని కామెంట్స్ చేసారు. దాంతో అక్క‌డే ఉన్న మ‌హిళా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కంగ‌న చెంప ఛెళ్లుమ‌నిపించారు.

దాంతో ఎంపీపై చేయిచేసుకున్నందుకు ఆమెను వెంట‌నే విధుల నుంచి స‌స్పెండ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత కానిస్టేబుల్ మీడియా ముందు తానెందుకు కంగ‌న‌పై చేయి చేసుకోవాల్సి వ‌చ్చిందో తెలిపారు. రైతులు చేప‌డుతున్న ఆందోళ‌న‌ల్లో మ‌హిళ‌లు రూ.100 తీసుకుని ఈ ధ‌ర్నాల్లో పాల్గొన్నార‌ని కంగ‌న అన్నార‌ని.. ఆ ధ‌ర్నాలో త‌న త‌ల్లి, బిడ్డ కూడా ఉన్నార‌ని.. త‌మ బాధ‌లు తెలీకుండా ఖ‌లిస్తానీలు అని ఎలా అంటార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసారు.