Neha Sharma: ప్రైవేట్ భాగాల‌పై ఫోక‌స్ చేసి ఫోటోలు తీస్తున్నారు

neha-sharma-slams-photographers-for-taking-photos-from-wrong-camera-angles

Neha Sharma: కొంద‌రు మీడియా ఫోటోగ్రాఫ‌ర్ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు న‌టి నేహా శ‌ర్మ‌. చిరుత సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నేహా ఆ త‌ర్వాత కుర్రాడు అనే మ‌రో సినిమా చేసి బాలీవుడ్‌కి వెళ్లిపోయారు. అక్క‌డ మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే నేహా జిమ్‌కి వెళ్లే స‌మ‌యంలో లేదా ఏద‌న్నా ఈవెంట్‌కి వెళ్లే స‌మ‌యంలో ఫోటోగ్రాఫ‌ర్లు వెంబ‌డించి మ‌రీ త‌న ఫోటోలు తీస్తున్నార‌ని.. కొంద‌రైతే త‌ప్పుడు యాంగిల్స్‌లో ప్రైవేట్ భాగాల‌పై ఫోక‌స్ చేసి మ‌రీ తీస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇలాంటి ఫోటోగ్రాఫ‌ర్ల వ‌ల్ల హీరోయిన్లు త‌మ‌కు న‌చ్చిన డ్రెస్సులు వేసుకోలేని ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని.. ఇలాంటి ఫోటోగ్రాఫ‌ర్ల‌ను బ్యాన్ చేయాల‌ని పిలుపునిచ్చారు.