నో ఎంట్రీ.. గెటౌట్.. అధికారుల‌కు అపాయింట్మెంట్ ఇవ్వ‌ని బాబు

Chandrababu Naidu denies appointment to ysrcp pro officers

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న ప‌ట్ల క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించిన అధికారులు ఇప్పుడు బాబు అపాయింట్మెంట్ కోసం ప‌డిగాపులు కాస్తున్నారు. CID, SIT చీఫ్‌ల‌కు అపాయిట్మెంట్ ఇవ్వ‌న‌ని తెగేసి చెప్పేసారు. ఖాకీ డ్రెస్సుల‌కు క‌ళంకం తెచ్చిన అధికారుల‌తో తాను అస్స‌లు మాట్లాడ‌న‌ని మండిప‌డ్డారు. మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ పేరుతో ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నాయుడు నివాసానికి వెళ్తున్నారు. వారిని భ‌ద్ర‌తా సిబ్బంది గేటు బ‌య‌టే ఆపేసి వెనక్కి పంపిచేస్తున్నారు.