Prajwal Revanna: క‌ర్ణాట‌క‌ సెక్స్ కుంభ‌కోణం వెనుక ప్ర‌జ్వ‌ల్ త‌ల్లి..!?

prajwal revanna's mother behind sex scandal

Prajwal Revanna: క‌ర్ణాట‌క హ‌స‌న్‌కు చెందిన మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవణ్ణ సెక్స్ కుంభ‌కోణంలో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 3000 మంది మ‌హిళ‌ల‌ను ఆయ‌న లైంగికంగా వాడుకుని వీడియోలు తీసార‌ని ఒక్కో విష‌యం బ‌య‌టికి రావ‌డం క‌ర్ణాట‌క‌లో సంచ‌ల‌నం సృష్టించింది. వీడియోలు బ‌య‌టికి రావ‌డంతో వెంట‌నే ప్ర‌జ్వ‌ల్ భార‌త్ వ‌దిలి జ‌ర్మ‌నీ పారిపోయి కొన్ని రోజుల పాటు అక్క‌డే దాక్కున్నారు. ఆ త‌ర్వాత త‌న తాత‌గారు, మాజీ ప్ర‌ధాని దేవె గౌడ లొంగిపోవాల‌ని ఆదేశించ‌డంతో వారం రోజుల క్రితం క‌ర్ణాట‌క పోలీసుల‌కు లొంగిపోయాడు. ఇప్పుడు ఆయ‌న‌పై స్పెష‌ల్ ఇన్‌వెస్టిగేష‌న్ టీం విచార‌ణ జ‌రుపుతోంది.

ఇప్పుడు ఈ సెక్స్ కుంభ‌కోణానికి సంబంధించిన ఒక షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇత‌ర ఆడ‌వాళ్ల ప‌ట్ల లైంగిక దాడి చేయాల‌ని ఈ ఊబిలోకి దించింది ప్ర‌జ్వ‌ల్ త‌ల్లి భ‌వానే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో భ‌వాని స్థానిక న్యాయ‌స్థానంలో ముంద‌స్తు బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా అందుకు కోర్టు నిరాక‌రించింది. ఓ మ‌హిళ‌ను ప్ర‌జ్వ‌ల్ చేత కిడ్నాప్ చేయించి లైంగికంగా వేధింపుల‌కు గురిచేసింది భ‌వానే అని సిట్ బృందం కోర్టుకు తెలిపిన స‌మాచారం.

అయితే దీనిపై మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. ప్ర‌జ్వ‌ల్‌పై కేసు పెట్టిన బాధిత మ‌హిళ‌ల్లోని ఓ మ‌హిళ‌ను భ‌వానీ త‌న డ్రైవ‌ర్ చేత కిడ్నాప్ చేయించి కేసు వాప‌సు తీసుకోవాలని బెదిరించార‌ని.. అంతేకానీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ కుంభ‌కోణానికి.. భ‌వానీకి ఎలాంటి సంబంధం లేద‌ని కూడా విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అంటున్నాయి.

ఒక లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ హ‌సన్ ఎంపీగా ఓడిపోయారు. దీనిపై ప్ర‌జ్వ‌ల్ మామ అయిన కుమార‌స్వామి స్పందిస్తూ… ప్ర‌జ్వ‌ల్ ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఓడిపోయాడు కానీ ఈ సెక్స్ కుంభ‌కోణం కేసు వ‌ల్ల కాద‌ని క‌ప్పిపుచ్చుకోవ‌డం సిగ్గుచేటు.